Support Us

Swechha @ Veeravaram ZP High School

వీరవరం హైస్కూల్ :

వీరవరం హైస్కూల్ లో 09-11-15 వ తేదిన   స్వేఛ్చ కార్యక్రమం లో భాగంగా  బడిలోని 8,9,10 వ తరగతి ఆడపిల్లలకు ఋతుచక్ర సంబంధిత ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించడం జరిగింది.కొన్ని వీడియోలు,కొన్ని క్లిప్పింగ్స్ ని  పవర్ పాయింట్ ద్వారా చూపించడం జరిగింది.ఈ కార్యక్రమము లో స్కూల్ టీచర్స్ కూడా పాల్గొన్నారు.

పిల్లలందరూ ఎంతో చక్కగా చూపించిన క్లిప్పింగ్స్ ఇంకా వీడియొ లను శ్రద్ధగా చూసి,వారికున్న అనుమానాలను నివృత్తి చేసుకున్నారు.కార్యక్రమం చివరిలో వారికి ఉన్నఅనుమానాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమం గురించి కొంత మంది పిల్లలు మాట్లాడతూ, మాకు ఎప్పట్నుండో ఉన్న అనుమానాలు ఈ కార్యక్రమం దూరం చేసిందని,ఋతుచక్ర సమయంలో పాటించాల్సిన నియమాలను తెలుసుకున్నామని ,తప్పనిసరిగా పాటిస్తామని చెప్పారు.కార్యక్రమానికి హాజరైన కొంత మంది ఆడపిల్లల తల్లులు మాట్లాడతూ మాకు ఇప్పటికి కూడా తెలియని కొన్ని విషయాలను మేము తెలుసుకున్నాము అని ఆనందం వ్యక్తం చేసారు.

 

 Veeravaram Swechha Photo Gallery