Support Us

Project SWECHHA

Project “SWECHHA” – Awareness Campaigns in Government High Schools

Swechha Proposal pdf icon

PCT SAHAJA Report – Feb 2019pdf icon

SWECHHA Promo Video
ఆరోగ్యవంతమైన సమాజం ఆరోగ్యవతమైన కుటుంబాల ద్వారానే సాధ్యమవుతుంది . అలాగే కుటుంబ ఆరోగ్యానికి ఆ ఇంటి ఇల్లాలి ఆనందం , ఆరోగ్యం సూచిక . అటువంటి ఇల్లాలికి పాఠశాల స్థాయి నుంచే అన్ని విషయాలలో అవగాహన చాల అవసరం . కానీ మనలో, మన వ్యవస్తలో ఉన్న అనేక లోపాల కారణం గా మన ఆడపిల్లల విషయం లో అన్యాయం జరుగుతుంది.

మిగతా విషయాలు ప్రక్కన పెడితే కౌమార దశ లో మన పిల్లలో జన్యు పరం గా , చాల సహజ సిద్దం గా జరిగే శారీరిక , మానసిక మార్పులను వారికీ అర్ధం అయ్యే రీతిలో చెప్పలేక పోతున్నాం. ఆ సమయం లో వారికీ ఉత్పన్నమయ్యే రక రకాల సందేహాలను నిర్మొహమాటం గా , స్వేఛ్చ గా మనతో పంచుకునే అవకాశం కల్పించలేక పోతున్నాం. దీని వల్ల వారు ఇక్కడ సగం , అక్కడ సగం వింటూ మిడి మిడి జ్ఞానంతో ఎదుగు తున్నారు. ఆ కారణం గా వాళ్ళ సందేహాలు కాస్తా అపోహలు గా మారుతున్నాయి. కాల క్రమేణా ఈ అవగాహనా రాహిత్యం మూలం గా మన బంగారు తల్లులు రకరకాల సమస్యలకి గురవుతున్నారు .

తల్లికి , చెల్లికి, భార్యకి, కూతురికి , అందరికి జరిగే ఋతుస్రావం వంటి అతి సహజ ప్రక్రియ గురించి మన పిల్లతో మనం మాట్లాడ కుండా చాలా తప్పు చేస్తున్నాము .నెలసరి సమయం లో వారు పడే శారీరక, మానసిక వత్తిడి వారికీ మాత్రమే తెలుసు .
ఆ సమయం లో ప్రేమ తో దగ్గరికి తీసుకోవడం మానేసి వాళ్ళని అంటరాని వాళ్ళు గా చేస్తున్నాము. దురదృష్టం ఏమిటంటే బాగా చదువు కున్న తల్లి తండ్రులు ఉన్న ఇళ్లలోనే పరిస్తితి ఇలా ఉంటె ఇక మారు మూల గ్రామీణ కుటుంభాల్లో ఎదుగుతున్న చిన్నారుల పరిస్తితి ఏమిటి ?

“నెల నెలా ముట్టు అనేది సిగ్గుపడాల్సిన విషయం కాదు నాన్నా. ఒక ఆడపిల్లగా నువ్వు ఆరోగ్యం గా ఉన్నవని గర్వపడాల్సిన విషయం” అని మన బిడ్డలతో మనం కాక ఇంకెవరు చెబుతారు? ఆలా చేప్పే ప్రయత్నం లో మేము వేసిన తొలి అడుగు ” స్వేఛ్చ” కార్యక్రమం . ఈ కార్యక్రమం లో భాగం గా ప్రభుత్వ పాఠశాల ల్లో ఉన్న బాలికలకు ఋతుచక్ర ప్రక్రియ, సందేహాలు, సమాధానాలు,జాగ్రతలు వంటి పలు విషయాల్లో పూర్తి స్తాయి అవగాహన కల్పించడం జరుగుతుంది ( పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, వీడియోలు , బృంద చర్చ ద్వారా ).

ఈ ప్రయత్నం ద్వారా మా ఆశ , ఆశయం , స్వార్ధం ఒక్కటే – ఈ రోజు పాఠశాల లో ఉన్న ప్రతి బాలిక పూర్తి అవగాహన పెంపొందించుకుని ఆరోగ్యవంతమైన తల్లి గా ఎదగాలి…..తద్వారా ఆరోగ్యవంతమైన కుటుంబాలు ఏర్పడాలి ….మనందరం ఆరోగ్యవంతమైన సమాజం లో బ్రతకాలి.

 

Programme Objective

The objective of the programme is to conduct awareness sessions for adolescent girls in government high schools about “menstruation and related health issues”.

By this Programme we empower the girl children in the areas of:

1)    Improving menstruation hygiene , personal hygiene , health and diet

2)   Usage of Sanitary Napkins and their disposal

3)   Educating the parents to follow safe and healthy methods during the cycle

Swechha Programme Introduction

 Slide1

sweccha-telugu

Photo Gallery of SWECHHA Campaign

 

SWECHHA Program in MEHABUBNAGR District, TS

We have partnered with a local NGO called PRAGATHI WELFARE SOCIETY in Burgula of Mahbubnagar District, TS and conducted SWECHHA programme in 11 ZP High Schools.

To view the complete report  Project Report – PWS – PCT

 

12.09.2015 (3 pm to 5pm) – A campaign has been initiated by PCT (at Ramakrishna Seva Samithi, Kakinada) to educate the girl children in the area of menstruation. It is sad that this subject is treated as taboo even in 2015. It happens to my mother, my sister, my wife and my daughter – still I feel shy to openly discuss about it. This has to change. Every parent should talk to their girls about this natural process and tell them to feel proud of it and not the other way around.
Dr. Rajyalakshmi, Pathology Professor from Rangaraya Medical College interacted with 100+ high school children on several topics related to menstruation and hygiene. At the very end all the girl children were supplied with sanitary pads. There were 15 girl VIPs (Volunteers In Public Service) from PR Govt. Degree College who have participated in this event and helped PCT coordinating the whole session.
This campaign will continue to go to the school level to spread the awareness among the girl children.
A silent malady is crippling over 200 million women living in rural India. These women, aged between 12 and 47, are precluded from freely engaging in and contributing to their communities simply because they lack access to affordable sanitary protection. The implications are real – every year, many of these rural girls and women miss up to 50 days of work or school.Many school age girls either fall behind or drop out of school entirely. Along with economic challenges, cultural stigmas prevent many women from easily accessing safe sanitary protection, especially in the most rural Indian communities. More alarmingly, many of these women resort to using less hygienic alternatives such as rags to meet their need for sanitary protection, risking infection. Rudimentary forms of sanitary protection can lead to serious infections. This problem is not limited to India but is global problem that affects women in many parts of the world.
Additionally, in rural areas, disposal of sanitary pads is a huge issue. Those few women in rural areas who do occasionally use sanitary pads dispose of them by burning or burying them, since there are no other options. This leaves them exposed to the toxic chemicals in the pad materials, which poison the environment and have adverse health risks.
 
So, bringing awareness is important and should happen now.

Swechha Campaign School Visits

08.10.2015: SWECHHA Campaign at ZP High School Tatiparthy. Our Swechha team lead by Ms. Deepthi interacted for 2 hrs with 150+ girl children on the menstruation and related topics. We are  glad to say, the girls have participated very actively and promised to use safe methods during their monthly cycle. Many girls have expressed that they became more knowledgeable about the whole process and lot of misconceptions have been cleared with this interactive session. We are hoping to conduct these sessions in every Govt High Schools of the district. Thank you.

Feedback From Girl Children from Different Schools

స్వేఛ్చ కార్యక్రమం లో భాగంగా ప్రభుత్వ బడులలోని 8,9,10 వ తరగతి ఆడపిల్లలకు ఋతుచక్ర సంబంధిత ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించడం జరిగుతోంది.కొన్ని వీడియోలు,కొన్ని క్లిప్పింగ్స్ ని  పవర్ పాయింట్ ద్వారా చూపించడం జరిగింది.ఈ కార్యక్రమము లో పిల్లలతో పాటు ఉపాధ్యాయులు కూడా పాల్గొనడం జరుగుతోంది.

పిల్లలందరూ ఎంతో చక్కగా చూపించిన క్లిప్పింగ్స్ ఇంకా వీడియొ లను శ్రద్ధగా చూసి,వారికున్న అనుమానాలను నివృత్తి చేసుకుంటున్నారు.కార్యక్రమం చివరిలో వారికి ఉన్నఅనుమానాలను అడిగి తెలుసుకుంటున్నారు.

ఈ కార్యక్రమం గురించి కొంత మంది పిల్లలు మాట్లాడతూ, మాకు ఎప్పట్నుండో ఉన్న అనుమానాలు ఈ కార్యక్రమం దూరం చేసిందని,ఋతుచక్ర సమయంలో పాటించాల్సిన నియమాలను తెలుసుకున్నామని ,తప్పనిసరిగా పాటిస్తామని చెప్పారు.కార్యక్రమానికి హాజరైన కొంత మంది ఆడపిల్లల తల్లులు మాట్లాడతూ మాకు ఇప్పటికి కూడా తెలియని కొన్ని విషయాలను మేము తెలుసుకున్నాము అని ఆనందం వ్యక్తం చేసారు.

ఇప్పటివరకు బహిష్టు అనేది చాలా అపవిత్రమినదని అనుకునే వాళ్ళమని,ఎందుకు అమ్మాయి గా పుట్టానా అని బాధ పడేవాళ్ళమని కానీ ఏ కార్యక్రమం తరువాత మా ఆలోచనలు మారాయని ఎలాంటి పరిశుభ్రత పాటించాలో,ఎలాంటి ఆహారపు అలవాట్లను పెంచుకోవాలో తెలుసుకున్నామని తెలిపారు.

కార్యక్రమం మాకు ఎంతో ఉపయోగకరమైన కార్యక్రమం అని తెలిపారు.మాకు తెలియని ఎన్నో విషయాలు తెలుసుకున్నామని పరిశుబ్రతను పాటిస్తామని “శానిటరీ ప్యాడ్స్” వాడతామని తెలిపారు.  వ్యక్తిగత పరిశుభ్రత తో పాటు స్కూల్ బాత్రూమ్ లను కూడా శుభ్రంగా ఉపయోగిస్తామని తెలిపారు.

అదే విధంగా ఆడపిల్లందరు వారి ఊరి లోని ఆడవాళ్ళకి కూడా ఈ కార్యక్రమం నిర్వహించాలని వారికి కూడా ఈ అవగహన అవసరమని తెలిపారు.

PCT-Project SWECHHA-Proposal

School Visits