Support Us

Remedial Teaching for Learning Disabled Children

FREE WORKSHOP for Teachers & Parents on Learning Disabilities AND Remedial Teaching

 

DATES:    Jan 17th & Jan 18th                                           TIME:  9am to 5pm

VENUE: Maharshi Sambamurthy Institute of Social and Developmental Studies (MSI), Opp to Rotary Club, Near Kalpana Center, Kakinada

Master Teacher :  Smt. Lakshmibai Kallakuri, B.A (Sp.Ed)., M.Ed (Learning disabilities.)

Introduction: Learning Disabilities అంటే విద్య నేర్చుకొనడములో అశక్తత. ఈ అశక్తత పలు విధములు. చదవటము, వ్రాయటము, లెఖ్ఖలు చేయడములో ఎన్నో లోపాలతో ప్రకటితమవుతాయి.  ఇవి మన స్కూళ్ళలో ప్రతి క్లాసులో 10% విద్యార్ధులలో చదువు యందు వెనుకబడిన  విద్యార్ధులలో బహిర్గమవుతాయి. (academically disadvantaged children). వీరు సాధారణ / అతి సాధారణ తెలివితేటలు (average /above average Intelligence) ఉన్నవారే.

ఈ అశక్తతకు ఒకోసారి అనారోగ్యము, కుటుంబ పరిస్థితులు అయినప్పటికి వీరికి తరగతుల్లో  చెప్పే బోధనా పద్ధతుల తో గ్రహించలేక చదువులో వెనుక బడతారు. చదవటము గానీ, వ్రాయటము కానీ, లెఖ్ఖలు చేయటములోని తమ తప్పులు బయటికి కనిపించకుండా చాలా తెలివిగా వ్యవహరిస్తారు. క్లాసు జరుగకుండా అతిగా ప్రశ్నలు వేయడము, తరచు లేచి నిలబడటము, బయటికి వెళ్ళిపోవటము, లేక ఏమీ  చెయ్యకుండా   నిస్సబ్దుగా  కూర్చోవడము, అనేక రకములుగా ప్రవర్తిస్తుంటారు. ఇటువంటివారికి తగిన విద్యయే Remedial Teaching అంటే వీరికి తగిన ప్రత్యేక బోధనా పద్ధతులలొ నేర్పిస్తారు.(ప్రత్యేక విద్యా అశక్తతల విద్యార్ధి – తగిన బోధన.)

Summarized Version of Workshop Interaction

1)      Learning Disabilities ఉన్న పిల్లలు ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఉంటారు, అందరికీ ఒకే పద్ధతి ద్వారా బోధించడం కుదరని పని అని అర్ధం అయ్యింది. ఒక్కో పద్ధతి ఒక్కొక్కరిని కదిలిస్తుంది.  వాళ్ళని సరి చేసి మిగతా వారితో పాటు సమాన స్థాయికి తీసుకు రావడానికి సమయం పడుతుంది. ఈ ప్రయత్నంలో ఉపాధ్యాయునికి చాలా ఓపిక అవసరం. ఈ ప్రయత్నం లో పిల్లవాడి తల్లి దండ్రులని కుడా కలుపుకుంటే తక్కువ సమయంలో అనుకున్న ఫలితాలు సాధించవచ్చు.

2)      ఇటువంటి పిల్లలకు ఏదోక రంగంలో ప్రత్యేక ప్రతిభ, ఆసక్తి ఉంటాయి. ఉదా. ఆటలు బాగా ఆడటం (sports), బొమ్మలు చక్కగా గీయడం & తయారు చేయడం (craft & drawing), పాటలు బాగా పాడటం (singing), బాగా తయారు కావడం (fashion designing), తడబాటు, భయం లేకుండా గల గలా మాట్లాడటం (spontaneity) , అంతు చిక్కని ప్రశ్నలు వెయ్యడం (critical thinking) etc. వాళ్ళకున్న ఆసక్తిని, ప్రతిభని గుర్తించి, వాళ్ళని మెచ్చుకుంటూ, వాళ్ళకి ఇష్టమైన విషయాల గురించి మాత్రమే మాట్లాడుతూ తద్వారా అక్షరాలూ, పదాలు, వాక్యాలు నేర్పడానికి ప్రయత్నించాలి. వాళ్ళు చేసే ప్రతి చిన్న పనినీ పొగిడి, చిన్న చిన్న బహుమతులు ఇస్తూ చదువు మీద ఆసక్తి కలిగేలా చెయ్యాలి. ఉదా. నాకు మేకలు కాయడం అంటే ఇష్టం అనే పిల్లాడితో…..నువ్వు మేక అని రాయగలవా అని చూడండి. వాడు తప్పకుండా ప్రయతిస్తాడు. అక్కడి నుంచి మొదలు పెట్టండి. అంతే కాని నువ్వు అ,ఆ….అం, క,ఖ,…..ఇవన్నీ నేర్చుకోరా నువ్వు బాగుపడతావు అంటే వాడు మీ దగ్గరికి కూడా రాడు.

3)      ఈ వర్క్ షాప్  వల్ల నేను బోధనా విధానంలో వెంటనే చేస్తున్న మార్పు: a) 3Rs కోసం ఒక పీరియడ్ పెడతాను. b) Remedial Teaching ని నా బోధనలో ఒక భాగంగా చేస్తాను. c) పిల్లల సమస్యలకు ఇంతకు ముందు బోధించిన ఉపాధ్యాయులను, తల్లి దండ్రులను blame చెయ్యడం మానుకుంటాను. d) నేను కష్టపడకుండా వాళ్లకి మేలు జరగదు అనే వాస్తవం ఆధారంగా అదనపు సమయం పిల్లలకు కేటాయిస్తాను.

4)      జ్ఞాపకశక్తి లో ఉన్న రకాల గురించి (short term, long term, sequential memory), జ్ఞానేంద్రియాల ద్వారా జరిగే INPUT, PROCESS, OUTPUT విషయాల గురించి, అవయవ లోపం వల్ల నేర్చుకునే విధానం పై ఉన్న ప్రభావం గురించి, left-right (reverse reading & reverse writing) సమస్య గురించి, పిల్లల మానసిక, భౌతిక ఎదుగుదలలో ఉన్న తేడా గురించి వివరించిన విషయాలు చాలా ఉపయోగపడేలా ఉన్నాయి. అనేక కొత్త విషయాలు నేర్చుకున్నాము.

5)      ఇటువంటి పిల్లలని తరగతి గదిలో ఎలా గుర్తించాలో తెలిపిన పద్ధతులు (ముఖ్యంగా వాళ్ళ ప్రవర్తన ఆధారంగా) చాలా ఆసక్తికరంగా ఉన్నాయి.

6)      నాడీ కలయికల సంబంధాల స్పందనలు సరిగా ఉండక పోవడమే ప్రత్యేక అశక్తతల విద్యార్ధి (Specific learning disabled student) లోపాలు. ఇటువంటి పిల్లలను మాకు తెలీకుండా ఎంత ఒత్తిడికి గురి చేస్తున్నామో అర్ధం అయ్యింది. వాళ్ళతో ఎంత ఓపికతో ఉండాలో తెలిసింది.

7)       గమనించిన విషయముల నన్నిటిని “Educational Assessment Form”  లో వ్రాసి పెట్టుకోవాలి. ఇది భవిష్యత్ కార్యక్రమమునకు కూడా తోడ్పడుతుంది. విద్యార్ధిని బాగా గమనించిన తరువాత

” ప్రత్యేక ఆశక్తతల విద్యార్ధి విద్యా ప్రణాళిక  INDIVIDUALIZED EDUCATIONAL PLAN  తయారు చెయ్యాలి. ఇది దీర్ఘ కాల (సంవత్సర) ప్రణాళిక.

8)       విద్యార్ధి వివరములు, దీర్ఘ  కాల ధ్యేయము (ultimate goal), విద్యార్థి స్థాయి, విద్యార్ధి స్థాయి ప్రకారము నేర్పించాల్సినవి, మార్పు చేయ్యాలసిన ప్రవర్తన, ఇతర సహాయములు (Medical, Paramedical) అన్నీ వ్రాసి పెట్టుకోవాలి.

9)      స్వల్పకాల పాఠ్య  ప్రణాళికలు (Lesson Plans), ధ్యేయము (Specific objective) చెప్పబోవు పాఠములు, ముఖ్యమైన అంశములు, కావలసిన పరికరములు Teaching aids, బోధనా పద్ధతి, ఫలితములు, పరిశీలనలు (observations) వ్రాయాలి. ఇవి తర్వాత భవిష్యత్త్తు కార్యక్రమానికి తోడ్పడుతుంది. అందరి ప్రణాళికలు  ఒకేలా ఉండవు. టీచర్లు చాలా అప్రమత్తగా ఉండాలి. ఇది ఒక చాలెంజ్.

10)   ఇటువంటి పిల్లలతో పనిచెయ్యడం చాలా ఓపికతో కూడిన పని. ప్రతి క్షణము వారిని మెప్పిస్తూ క్లాసు వర్క్ చేసే నేర్పరితనముండాలి. సాధ్యమైనంతవరకు వారికిష్టమైన మాటలు మాట్లాడాలి. వారి  స్థాయిని బట్టి పాఠ్యాంశాలు కుదించి వ్రాయాలి. వారికి చిన్నవైనా మంచి ఫలితము ఇచ్చేటట్లు పాఠాలు తయారు చేయాలి. జ్ఞాపకశక్తి అభ్యాసములు ఛేయించాలి. రోజూవారి జీవితముతో అన్వయిస్తూ పాఠాలు తయారు చెయ్యాలి. చదువు అంటే ఆడుతూ పాడుతూ ఉండి నేర్చుకోవాలన్నతపన వచ్చేటట్లు చెయ్యాలి.

APPEAL FROM PADALA CHARITABLE TRUST (PCT)

Learning Disabilities ఉన్న పిల్లలు ఎవరైనా మీ పాఠశాలలో గాని, మీకు తెలిసిన ఇతర పాఠశాలల్లో గాని ఉండి, వాళ్ళని మీరు దత్తత తీసుకుని వారికి remedial teaching చెయ్యడానికి ముందుకు వస్తే, మా సంస్థ సహకారం మీకు తప్పకుండా ఉంటుంది. అటువంటి వారు మమ్మలిని సంప్రదిస్తే, దానికి సంబంధించిన మెటీరియల్ వగైరా అందజేయగలము. మీతో కలిసి పనిచేయడానికి మేము సిద్ధం.

 

Suryaprasad Padala

Padala Charitable Trust

padalasurya@yahoo.com

www.padalacharitabletrust.org