Support Us

Swechha@Chandrampalem ZP High School

చంద్రంపాలెం స్వేఛ్చ:

చంద్రంపాలెం హైస్కూల్ లో 14-11-15 వ తేదిన జరిగిన స్వేఛ్చ కార్యక్రమం లో బడిలోని 8,9,10 వ తరగతి ఆడపిల్లలు, టీచర్స్ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు.కార్యక్రమం మొదట్లో ఈ విషయం వారికి ఎన్నో అనుమానాలు ఉన్నాయని తెలిపారు.

గంట పాటు కొనసాగిన ఈ కార్యక్రమం లో ఎన్నో విషయలు చెప్పడం జరిగింది,వీడియోలు కూడా చూపించడం జరిగింది, ఆడపిల్లలు అందరు చాలా శ్రద్దగా అన్నిటిని వినడం జరిగింది.

కార్యక్రమం అనంతరం పిల్లలు మాట్లాడతూ మాకు ఎవరు ఈ విషయంపై ఇప్పటివరకు ఎటువంటి అవగాహన కలిపించాలేదని,బహిష్టు అనేది చాలా అపవిత్రమినదని అనుకునే వాళ్ళమని,ఎందుకు అమ్మాయి గా పుట్టానా అని బాధ పడేవాళ్ళమని కానీ ఏ కార్యక్రమం తరువాత మా ఆలోచనలు మారాయని ఎలాంటి పరిశుభ్రత పాటించాలో,ఎలాంటి ఆహారపు అలవాట్లను పెంచుకోవాలో తెలుసుకున్నామని తెలిపారు.

 

Chandrampalem Swechha Photo Gallery